గూగుల్ ఎర్త్ వీఆర్‌తో భూలోక సందర్శన

గూగుల్ ఎర్త్ వీఆర్‌తో భూలోక సందర్శన

లాస్‌ఏంజెలిస్: గూగుల్ ఎర్త్ వర్చువల్ రియాలిటీ (వీఆర్) టూర్‌తో ఉన్న చోటు నుంచి కదులకుండా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చని, త్రీడీ హెడ్‌సెట్‌తో కొత్త అనుభవాన్ని పొందవచ్చని గూగుల్ సంస్థ తెలిపింది. వీఆర్‌లో ఆవిష్కరించిన కొత్తరకం ఫీచర్‌తో ప్రజలు తమకు ఇష్టమైన ప్రాంతాలను కూర్చున్న చోటు నుంచే సందర్శించ వచ్చునని ఈ విభాగం ప్రొడక్ట్ మేనేజర్ జోన్నా కిమ్ చెప్పారు. చూ డాలనుకున్న ప్రాంతం పేరు, లేదా చిరునామాను టైప్‌చేసి త్రీడీ హెడ్‌సెట్‌తో మనకు నచ్చిన చోటు కు వెళ్లిరావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం వీఆర్‌లో లభిస్తున్న 27 రకాల ప్రాంతాలను కూడా చూడవచ్చని తెలిపారు.