వందేండ్ల నాటికి అంగారకునిపై మొదటి నగరం

వందేండ్ల నాటికి అంగారకునిపై మొదటి నగరం

దుబాయ్: 2117 సంవత్సరం నాటికి అంగారకునిపై మొదటి నగరాన్ని నిర్మించాలని యూఏఈ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. రానున్న కొన్ని దశాబ్దాల్లో మనుషులను మార్స్‌పైకి పంపాలని తలపోస్తున్నది. యూఏఈ ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుం, దుబా య్ రాజకుమారుడు, యూఏఈ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ వచ్చే వందేండ్లకు సంబంధించిన ప్రాజెక్టు వివరాలను 138 దేశాల ప్రతినిధులు, ఆరు అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో ప్రకటించారు. ఇందుకోసం కొన్ని ప్రత్యేక అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్టు చెప్పారు.