ఇండియన్ రెస్టారెంట్‌ ఫుడ్ తిని యువతి మృతి

ఇండియన్ రెస్టారెంట్‌ ఫుడ్ తిని యువతి మృతి

లండన్: ఓ ఇండియన్ రెస్టారెంట్ సమకూర్చిన 'టేక్ అవే' మీల్స్ తిన్న ఓ బ్రిటన్ యువతి... ఫుడ్ పాయిజన్‌కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. దీంతో ఇద్దరు రెస్టారెంట్ ఇబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే.. మేగన్ లీ అనే 15 ఏళ్ల యువతి.. లాంక్‌షైర్‌లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్‌లోని భోజనం తిని తీవ్ర రియాక్షన్‌కు గురైంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

రెండు రోజుల చికిత్స తర్వాత చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే చనిపోయింది. న్యూ ఇయర్ రోజునే ఈ దారుణం చోటు చేసుకోవడం కలచివేసే విషయం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మరణానికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ... అందులోని విషయాలను పోలీసులు ఇంతవరకు బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, ఘటనపై విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.