అంధుల క్రికెటర్లను బీసీసీఐ పరిధిలోకి తీసుకోవాలి

అంధుల క్రికెటర్లను బీసీసీఐ పరిధిలోకి తీసుకోవాలి

  న్యూఢిల్లీ: అంధుల క్రికెట్ సంఘం(సీఏబీఐ)ను బీసీసీఐ పరిధిలోకి తీసుకోవాలంటూ మాజీ కెప్టెన్ బిషన్‌సింగ్ బేడీ డిమాండ్ చేశాడు. శుక్రవారం ఇండస్‌ఇండ్ బ్యాంక్ అంధుల క్రికెట్ కాన్‌క్లేవ్-2018 పేరిట ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయంతో ప్రపంచకప్ గెలిచిన భారత అంధుల జట్టును ఈ సందర్భంగా సన్మానించారు. ఇందులో బేడీతో పాటు సయ్యద్ కిర్మాణీ, మదన్ లాల్ పాల్గొన్నారు. బేడీ తన అనుభవాలను పంచుకున్నాడు. మాజీ కెప్టెన్ టైగర్ పటౌడీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మొత్తం ఒకే కన్నుతో ఆడాడు. టెస్ట్‌ల్లో అరంగేట్రానికి ముందు ఓ కారు ప్రమాదంలో పటౌడీ కన్ను కోల్పోయాడు. ఎవరైనా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం చేస్తే దాన్ని సహించేవాడు కాదు. ఏనాడు అదొక అంగవైకల్యంగా భావించలేదు. మీరు కోట్లాది మందికి స్ఫూర్తి. సీఏబీఐని బీసీసీఐ పూర్తిగా తమ పరిధిలోకి తీసుకుని అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందనుకుంటున్నాను అని బేడీ అన్నాడు.