అనుష్క శర్మకు కోహ్లి శుభాకాంక్షలు!

అనుష్క శర్మకు కోహ్లి శుభాకాంక్షలు!

   ‘హ్యాపీ బర్త్‌ డే మై లవ్‌, ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటూ.. అత్యంత నిజాయితీ కలిగిన వ్యక్తివి నువ్వు’ అంటూ బాలీవుడ్‌ నటి, తన సతీమణి అనుష్క శర్మకు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విటర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమ పెళ్లి తర్వాత అనుష్క తొలి బర్త్‌డే కావడంతో తన ప్రియమైన సతీమణికి కోహ్లి ఈ మేరకు ప్రత్యేక సందేశాన్ని అందించాడు. అతడు చేసిన ఈ ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌గా మారింది. విరుష్కా అభిమానులు అనుష్కకు విషెస్‌ చెబుతూ కోహ్లి, అనుష్క జంటగా ఉన్న ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

ఈ రోజు అనుష్క బర్త్‌డే వేడుకలను తమ సన్నిహితులు నడుమ ఘనంగా నిర్వహించడానికి కోహ్లి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్‌లో సందడి చేస్తూంటే.. సినిమా షూటింగ్‌లు లేని సమయంలో అనుష్క స్టేడియానికి వచ్చి అతని ఆటని ఆస్వాదిస్తున్నారు.నాలుగేళ్లుగా ప్రేమాయణం కొనసాగించిన భారత క్రికెట్‌ సారధి విరాట్‌ కోహ్లి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు అనుష్క పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న కోహ్లి ఎప్పుడూ ఆ బర్త్‌డే ఫొటోలను అభిమానులతో పంచుకోలేదు. తాజాగా మంగళవారం అనుష్క బర్త్‌డేకు సంబంధించిన ఫొటోను కోహ్లి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.