బురఖా నిబంధనకు నిరసనగా తప్పుకున్న భారత క్రీడాకారిణి

బురఖా నిబంధనకు నిరసనగా తప్పుకున్న భారత క్రీడాకారిణి

   హైదరాబాద్‌ : ఇరాన్‌లో నిర్వహించే  ఏషియన్‌ టీమ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ఃలో పాల్గొనడం లేదని మాజీ వరల్డ్‌ జూనియర్‌ బాలికల చాంపియన్‌, ఉమెన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ సౌమ్య స్వామి నాథన్‌ బుధవారం ప్రకటించింది. జులై 26 నుంచి ఆగస్టు 6 వరకూ ఇరాన్‌లోని హమదాన్‌లో నిర్వ హించే ఈ టోర్నీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్‌ దేశంలో ఉన్న తలకు తప్పనిసరిగా స్కార్ఫ్‌ ధరించాలఃనే నిబంధన వల్ల తాను ఈ టోర్నీ నుంచి తప్పుకుంటు న్నట్లు ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.ఇరానీ చట్టాలలో మహిళలు తప్పనిసరిగా తలపై స్కార్ఫ్‌ లేదా బురఖా ధరించాలనే నియమం ఉంది. కానీ ఇలా బలవంతంగా స్కార్ఫ్‌ లేదా బురఖా ధరించడం అంటే నా స్వేచ్ఛకు ఆటంకం కల్గించడమే అవుతుంది.