కెప్టెన్‌గా మిథాలీ రికార్డ్‌

కెప్టెన్‌గా మిథాలీ రికార్డ్‌

  గాలె: అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రీడాకారిణిగా భారత క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ చరిత్ర సృష్టిం చింది. ఇప్పటి వరకు 195 వన్డేలు ఆడిన మిథా లీరాజ్‌ 118 వన్డేలకు సారథ్యం వహించింది. ఐసిసి ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మహిళా జట్టు మిథాలీ నాయకత్వంలో శ్రీలంకలో పర్యటి స్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య లంకతో భారత్‌ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య ఈ రోజు తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌కు నాయకత్వం వహించిన మిథాలీ రాజ్‌ ఈ అరుదైన ఘనతను అందుకుంది. 

ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్‌ మాజీ క్రీడాకారిణి చార్లెట్‌ ఎడ్వర్ట్స్‌ (117) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి బెలిందా క్లార్క్‌ (101) ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ ముగ్గురు మాత్రమే వందకు పైగా వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు. న్యూజిలాండ్‌ క్రికెటర్‌ సుజీ బేట్స్‌ ప్రస్తుం 76 వన్డేలకు నాయకత్వం వహించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.2004లో మిథాలీ రాజ్‌ కెప్టెన్సీ పగ్గాలు అందుకుంది. భారత మహిళల క్రికెట్‌ జట్టుకు పిన్న వయస్సులోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న క్రికెటర్‌ కూడా మిథాలీనే కావడం విశేషం.