కోచ్‌ రవిశాస్త్రికి మూడు నెలలకే రెండు కోట్లు

కోచ్‌ రవిశాస్త్రికి మూడు నెలలకే రెండు కోట్లు

  ముంబయి : భారతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ) సోమవారం క్రికెటర్ల జీతాల వివరాలను వెల్లడించింది. అంతేగాక కోచ్‌ రవిశాస్త్రికి కేవలం మూడు నెలల కాలానికి (జులై 18, 2018 నుండి అక్టోబర్‌ 17, 2018వరకు) కోచ్‌ బాధ్యతలు నిర్వర్తించేందుకుగాను అడ్వాన్స్‌గా రూ.2 కోట్ల 5 లక్షల రూపాయలను ముందే చెల్లించింది. అలాగే టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతోపాటు జట్టులోని ప్రతి సభ్యునికి ఏయే పర్యటనకు ఎంతెంత చొప్పున చెల్లించిందో కూడా సోమవారం ప్రకటించింది. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కు రూ.65.06 లక్షలు, వన్డే సిరీస్‌కు రూ.30.70 లక్షలు చెల్లించగా... టెస్టుల్లో టాప్‌ ర్యాంక్‌లో నిల్చినందుకు కోహ్లీకి ఐసిసి 29.27 లక్షల రూపాయలు అందుకున్నాడు.