కికెట్‌కు బొలింజర్ గుడ్ బై

కికెట్‌కు బొలింజర్ గుడ్ బై

  సిడ్నీ: ఆస్ట్రేలియా పేస్ బౌలర్ డగి బొలింజర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 36 ఏండ్ల ఈ లెఫ్టార్మ్ పేసర్ 12 టెస్ట్ మ్యాచ్‌ల్లో 50 వికెట్లు, 39 వన్డేల్లో 62 వికెట్లు పడగొట్టాడు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 411 వికెట్లు తీసిన బొలింజర్, ఈ సీజన్ బిగ్‌బాష్‌లీగ్‌లోనూ ఆడాడు. 2009, 2010లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించగా, ఆ తర్వాత జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. దీంతో తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు.