ఢిల్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న గంభీర్‌

ఢిల్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న గంభీర్‌

  న్యూఢిల్లీ: ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వెటరన్‌ గౌతమ్‌ గంభీర్‌ తప్పుకొన్నాడు. అతడి స్థానంలో నితీష్‌ రాణాకు పగ్గాలప్పగించారు. యువకులకు అవకాశం కల్పించడం కోసమే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. కొత్త నాయకుడికి తగిన సూచనలు, సలహాలతో అండగా నిలుస్తానని చెప్పాడు. అయితే, ఈ రంజీ సీజన్‌లో గంభీర్‌ ఆడతాడా? లేదా? అనే విషయం ఇంకా స్పష్టం చేయలేదు.