డిఎస్పీ పదవి నుంచి తొలగింపు

డిఎస్పీ పదవి నుంచి తొలగింపు

  అమృత్‌సర్‌ : భారత మహిళాజట్టు టీ20 సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను డిఎస్పీ పదవినుంచి తొలగిస్తున్నట్లు పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. డిగ్రీ సర్టిఫికెట్‌తో పంజాబ్‌ పోలీసు శాఖలో గౌరవ డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించుకున్న హర్మన ్‌ప్రీత్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డిఎస్పీ ఉద్యోగం పొందే క్రమంలో ఆమె మీరట్‌లోని చరణ్‌సింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. సరిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆమె ఆ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసినట్లు ఎక్కడా వివరాలు లేవు. దీంతో హర్మన్‌ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా పంజాబ్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను డీఎస్పీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆ లేఖలో తెలిపారు. ఆమె క్రికెట్‌ కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొని ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.