>

ఇంగ్లండ్ బోర్డును హెచ్చరించిన షిర్కే!

ఇంగ్లండ్ బోర్డును హెచ్చరించిన షిర్కే!

ముంబై: ఇప్ప‌టికే సుప్రీంకోర్టు తీర్పుతో త‌న బీసీసీఐ కార్య‌ద‌ర్శి ప‌ద‌వి కోల్పోయిన అజ‌య్ షిర్కే.. తాజాగా మ‌రిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. అస‌లు ఇండియా, ఇంగ్లండ్ సిరీస్ షెడ్యూల్ ప్ర‌కారం ఉంటుందా అంటూ ఈసీబీ నుంచి వ‌చ్చిన ఈమెయిల్ షిర్కే భండారం బ‌య‌ట‌పెట్టింది. త‌న ప‌ద‌వి ఊడిన త‌ర్వాత షిర్కే.. ఈసీబీ చీఫ్ గైల్స్ క్లార్క్‌కు ఫోన్ చేశార‌ని, త‌న‌కు ఇక బీసీసీఐతో ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న చెప్పార‌ని క్లార్క్ ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో అస‌లు ఇంగ్లండ్ వ‌న్డే సిరీస్ ఆడుతుందా? వాళ్ల‌కు గ‌తంలో అందిన‌ట్లే అన్ని వ‌స‌తులు క‌ల్పిస్తారా అంటూ బోర్డు సీఈవో రాహుల్ జోహ్రికి మెయిల్ పంపించారు. ఇది మొత్తం బీసీసీఐకి చెందిన వ్య‌వ‌హార‌మే అయినా.. షెడ్యూల్ ప్ర‌కార‌మే సిరీస్ ఉంటుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? అన్న‌ది చెప్పాల‌ని క్లార్క్ ఆ మెయిల్‌లో కోరారు. 

అంటే త‌న ప‌ద‌వి పోయిన త‌ర్వాత ఇంగ్లండ్ సిరీస్‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యేలా షిర్కే ఏమైనా మాట్లాడారా అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌లను షిర్కే ఖండించారు. ఇంగ్లండ్ టీమ్‌ను పంపే ముందు మ‌రోసారి ఆలోచించండి అంటూ మీరు క్లార్క్‌కు ఫోన్ చేశారా అని షిర్కేను ప్ర‌శ్నించ‌గా.. త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డానికే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. వాళ్లు ఏం కావాలంటే అది చెబుతారు. కానీ అవ‌న్నీ అబ‌ద్ధాలే అని షిర్కే స్ప‌ష్టంచేశారు. తాను పద‌విలో లేక‌పోయినా ప్ర‌స్తుతం పుణెలో జ‌ర‌గ‌బోయే తొలి వ‌న్డే కోసం అధికారుల‌కు స‌హాయ స‌హకారాలు అందిస్తున్నాన‌ని, ఆట ప‌ట్ల త‌న‌కున్న నిబ‌ద్ధ‌త అలాంటిద‌ని షిర్కే అన్నారు.


Loading...