గెలిస్తే అగ్రస్థానం

గెలిస్తే అగ్రస్థానం

  భువనేశ్వర్‌ : ఆతిథ్య భారతజట్టు నేడు ఫేవరేట్‌ బెల్జియంతో లీగ్‌మ్యాచ్‌లో తలపడనుంది. ఇరుజట్లు తొలిమ్యాచుల్లో బలహీన దక్షిణాఫ్రికా, కెనడాలపై గెలిచి శుభారంభం చేశాయి. దీంతో నేడు జరిగే మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకంగా మారింది. గెల్చిన జట్టు దాదాపు క్వార్టర్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ మ్యాచ్‌ ఇరుజట్లకు కీలకం కానుంది. హాకీ ప్రపంచ కప్‌ వేటను టీమిండియా ఘనంగానే ఆరంభించింది. పూల్‌ 'సి'లో భాగంగా బుధవారం కళింగ మైదానంలో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5-0తో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి శుభారంభం చేసింది. 43 ఏళ్ల క్రితం అందుకున్న ప్రపంచ కప్‌ను ఈసారి సొంతగడ్డపై తప్పకుండా సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేసింది.

ప్రత్యర్ధి గోల్‌ పోస్ట్‌పై పదేపదే దాడులకు దిగి ప్రత్యర్థిని చిత్తు చేసింది. పలు పెనాల్టీ కార్నర్‌లు చేజారి నా పట్టు జారకుండా చూ సు కుంటూ జయ భేరి మోగించింది. మూడో ర్యాంక్‌ బెల్జియం విషయాని కొస్తే ఆ జట్టు తొలిమ్యాచ్‌లో కెనడాపై గెలవ డానికి చెమ టోడ్చాల్సి వచ్చిం ది. బలహీన కెనడాపై కేవలం 2 గోల్స్‌ మాత్రమే నమోదు చేసి, ప్రత్యర్ధి జట్టుకు ఒక గోల్‌ను సమర్పించుకుంది. 
మిడ్‌ ఫీల్డర్‌ సిమ్రన్‌జిత్‌ సింగ్‌ తొలిమ్యాచ్‌లో అదరగొట్టే ప్రదర్శన చేస్తూ రెండు గోల్స్‌ నమోదు చేశాడు. మన్‌దీప్‌ సింగ్‌, ఆకాశ్‌దీప్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యారు ఒక్కో గోల్‌ నమోదు చేసి ప్రత్యర్ధి సఫారీ జట్టుకు కనీసం ఖాతా తెరవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు.

కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో జూనియర్‌, సీనియర్‌ ఆటగాళ్ళ కలయికతో ఈసారి భారత్‌ టైటిల్‌ ఫేవరేట్‌గానే బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ సందర్భంగా ఆ జట్టు రెండుసార్లు గోల్‌ అవకాశాలు వచ్చినా భారత గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. మూడో ర్యాంక్‌ బెల్జియం తరఫున ఫెలిక్స్‌ డినయిర్‌, కెప్టెన్‌ థామస్‌ బ్రీల్స్‌ ఒక్కో గోల్‌ చేశారు. పెనాల్టీ కార్నర్‌ను నెట్‌లోకి పంపి మార్క్‌ పియర్సన్‌ కెనడాకు తరఫున గోల్‌ చేశాడు.ఆదివారం బెల్జియంతో జరిగే కీలకపోరులో భారతజట్టు ఓడితే క్వార్టర్స్‌కు చేరడానికి మరో అవకాశం లభించనుంది. గ్రూప్‌-సిలో రెండోస్థానంలో నిలవడం ద్వారా ఆయా గ్రూప్‌లలో రెండోస్థానంలో నిలిచిన జట్లతో క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించడానికి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. కెనడాతో మ్యాచ్‌లో రెండు గోల్స్‌తో అదరగొట్టిన ఆకాష్‌దీప్‌ సింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.