ఘనంగా బిసిసిఐ వార్షిక అవార్డులు కార్యక్రమం

ఘనంగా బిసిసిఐ వార్షిక అవార్డులు కార్యక్రమం

 బెంగళూరు : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బిసిసిఐ) వార్షిక అవార్డుల కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి పాలీ ఉమ్రిగర్‌ అవార్డును అందుకున్నాడు. 2016-17, 2017-18 సీజన్‌ల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు పాలీ ఉమ్రిగర్‌ అవార్డులు ఉత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌ అవార్డు కూడా విరాట్‌ కోహ్లికి దక్కింది. అలాగే మహిళా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించినందుకు బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ వుమన్‌ అవార్డులను భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సృతి మంధన గెలుచుకున్నారు. 2016-17 సీజన్‌కు హర్మన్‌ప్రీత్‌కు, 2017-18 సీజన్‌కు సృతి మంధనకు అవార్డు లభించింది. 

ఉత్తమ రాష్ట్ర సంఘాలుగా బెంగాల్‌ క్రికెట్‌ అసోషియేషన్‌, ఢిల్లీ క్రికెట్‌ అసోషియేషన్‌ అవార్డులు అందుకున్నాయి. అన్షుమన్‌ గైక్వాడ్‌, సుధా షాలకు సికె నాయుడు లైఫ్‌టైప్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి మహిళాజట్టు క్రికెటర్లు కూడా హాజరయ్యారు. మన్సూర్‌ ఆలీఖాన్‌ పటౌడీ జ్ఞాపకార్థం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన సతీమణి షర్మిలా ఠాకూర్‌ హాజరయ్యారు. పటౌడీ గురించి సందేశాన్ని ఇంగ్ల ండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ తెలియజేశారు.