హిమ కోసం ప్రత్యేక ట్రాక్‌

హిమ కోసం ప్రత్యేక ట్రాక్‌

  గౌహతి : ఆసియన్‌ క్రీడల్లో పాల్గొని తొలిసారి మూడు పతకాలు సాధించిన స్ప్రింటర్‌ హిమదాస్‌కు అస్సాం విమానాశ్రయంలో వినూత్న స్వాగతం లభిం చింది. ఎర్ర తివాచీ వేసి దానిపై స్టార్ట్‌ 1,2,3,4,5,6 అన్న సంఖ్యలతో ఉన్న ట్రాక్‌ను రూపొందించి అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనవాల్‌తోపాటు కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆమె తన స్వస్థలమైన గౌహతికి బయలుదేరారు. అరం గేట్రం ఆసియాక్రీడల అథ్లెటిక్స్‌ విభాగంలో హిమ మూడు పతకాలు గెల్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిమ కోసం అభిమానులు ఎయిర్‌పోర్ట్‌లో వేసిన ఈ ట్రాక్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. గౌహతి చేరుకున్నాక సారుసుజారు స్టేడియం, డాక్టర్‌ భూపేన్‌ హజారిక సమాధి క్షేత్ర స్థూపం వద్దకు చేరిన అనంతరం శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సన్మానించనుంది.