కెన్యా ప్రపంచ చాంపియన్‌ అథ్లెట్‌ నికోలస్‌ బెట్‌ మృతి 

కెన్యా ప్రపంచ చాంపియన్‌ అథ్లెట్‌ నికోలస్‌ బెట్‌ మృతి 

  నైరోబి: కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్, ప్రపంచ మాజీ చాంపియన్‌ నికోలస్‌ బెట్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం పశ్చిమ కెన్యాలో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల బెట్‌  దుర్మరణం పాలయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. అతనికి రెండు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ 400 మీటర్ల హర్డిర్స్‌లో బెట్‌ స్వర్ణం సాధించాడు. దీంతో పాటు చైనాలో జరిగిన షార్ట్‌ డిస్టెన్స్‌ హర్డిల్స్‌ టైటిల్‌... రెండు సార్లు ఆఫ్రికా హర్డిల్స్‌ చాంపియన్‌షిప్‌ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. బెట్‌ మృతిపై కెన్యా అథ్లెటిక్‌ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్రీడా రంగంలో అతని లోటు పూడ్చలేనిదని పేర్కొంది.