కోహ్లీని కలిసిన అక్కినేని  అఖిల్‌

కోహ్లీని కలిసిన అక్కినేని  అఖిల్‌

   టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సందడి చేశాడు. ఎప్పుడూ క్రికెట్‌ గ్రౌండ్‌లో బిజీగా ఉండే కోహ్లి కాస్త గ్యాప్‌ తీసుకొని షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నాడు. తాజాగా ఓ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొన్న కోహ్లిని టాలీవుడ్ యంగ్‌ హీరో అక్కినేని అఖిల్‌ కలిశాడు. శుక్రవారం నుంచి జరగనున్న టెస్ట్‌ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ చేరుకున్న కోహ్లి ఇక్కడే షూటింగ్‌లో పాల్గొన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ షూటింగ్ కు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి.