లక్ష్యసేన్‌కు సింగిల్స్‌ టైటిల్‌ టాటా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

లక్ష్యసేన్‌కు సింగిల్స్‌ టైటిల్‌ టాటా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

 ముంబయి : భారత బ్యాడ్మింటన్‌ యువ కెరటం లక్ష్యసేన్‌ మరో టైటిల్‌ సాధించాడు. నవంబర్‌లో జరిగిన ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో థారులాండ్‌ కుర్రాడి చేతిలో ఓడిన లక్ష్యసేన్‌... టాటా ఓపెన్‌ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకున్నాడు. కునల్‌విట్‌ విటిడ్‌శరణ్‌ (థాయ్‌లాండ్‌)తో వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌లో మూడు గేముల పాటు పోరాడిన లక్ష్యసేన్‌ తాజాగా అతడిని 21-15, 21-10 వరుస గేముల్లో మట్టికరిపించాడు. 35 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆటకట్టించి మెన్స్‌ సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో అస్మిత 21-16, 21-13తో వృశాలి గుమ్మడిపై గెలుపొంది టైటిల్‌ సొంతం చేసుకున్నది.