లార్డ్స్‌ టెస్ట్‌కి వర్షం ఆటంకం

లార్డ్స్‌ టెస్ట్‌కి వర్షం ఆటంకం

 లార్డ్స్‌: భారత్‌-ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్ట్‌కి వరుణుడు ఆటంకంగా మారాడు. వాతావరణంలో అనూహ్య మార్పులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. కాసేపట్లో లార్డ్స్‌ మైదానం పిచ్‌ను సమీక్షించి అంపైర్లు ఓ నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మొదటి టెస్ట్‌ ఓటమితో ప్రతీకారానికి కోహ్లి బృందం సిద్ధంకాగా.. మరో విజయంపై రూట్‌ సేన కన్నేసింది. స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ కావటంతో ఇద్దరితో టీమిండియా బరిలోకి దిగొచ్చనే సంకేతాలు అందుతున్నాయి.

తుది జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, విజయ్, రాహుల్, రహానే, కార్తీక్, పాండ్యా, కుల్దీప్‌/జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ.  
ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), కుక్, జెన్నింగ్స్, పోప్, బెయిర్‌స్టో, బట్లర్, వోక్స్‌/అలీ, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్‌.