మేడమ్ టుస్సాడ్స్‌లో కోహ్లీ విగ్రహం

మేడమ్ టుస్సాడ్స్‌లో కోహ్లీ విగ్రహం

  న్యూఢిల్లీ: మైదానంలో పరుగుల వరద పారిస్తున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం లభించింది. న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో వరుస రికార్డులతో హోరెత్తిస్తున్న కోహ్లీ మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ విగ్రహం తయారీకోసం కోహ్లీకి సంబంధించిన 200 కొలతలను లండన్ నుంచి వచ్చిన మ్యాజియం ఆర్టిస్టులు తీసుకున్నారు. త్వరలోనే మ్యాజియంలో కోహ్లీ విగ్రహం కొలువదీరనుండడం క్రికెట్ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నది. మేడమ్ టుస్సాడ్స్‌లో నా విగ్రహం ఉంచాలనుకోవడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. మ్యూజియం నిర్వాహకులకు నా ధన్యవాదాలు అని కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, 23వ విగ్రహంగా కెప్టెన్ కోహ్లీని ప్రకటించడం ఆనందంగా ఉందని భారత్ మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అన్షుల్ జైన్ తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్, సచిన్ సహా అంతర్జాతీయ స్టార్లు మెస్సీ, బెక్‌హాం, క్రిస్టియానో రొనాల్డో మైనపు విగ్రహాలు కొలువుదీర్చిన విషయం తెలిసిందే.