మార్టిన్‌ కోలుకుంటాడు : గంగూలీ

మార్టిన్‌ కోలుకుంటాడు : గంగూలీ

 అహ్మదాబాద్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్‌ జాకోబ్‌ మార్టిన్‌(46) కుటుంబానికి భారత ఆటగాళ్లు అండగా ఉండడంతోపాటు త్వరగా కోలుకోవాలని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ ఆకాంక్షించారు. గతేడాది డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మార్టిన్‌ వడోదరలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. ఈ క్రమంలో తమకు సహాయం చేయా ల్సిందిగా మార్టిన్‌ భార్య భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బిసిసిఐ)కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బిసిసిఐ 5 లక్షల రూపాయలు అందించగా బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ 3 లక్షల రూపాయల సాయం అందించింది. 

కాగా మార్టిన్‌ పరిస్థితి గురించి తెలుసు కున్న టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి ఆందో ళనకరంగా ఉందని, అతడు త్వరగా కోలుకోవాలని, మీరు ఒంటరి వాళ్లు కారు. మేమంతా మీకు తోడున్నాం' అంటూ మార్టిన్‌ కుటుంబ సభ్యులకు అండగా నిలిచాడు. గంగూలీతో పాటుగా జహీర్‌ ఖాన్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కూడా మార్టిన్‌కు సహాయం చేసేందుకు ముందుకువచ్చారని బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ సంజరు పటేల్‌ తెలిపారు.