మీ టు కు సింధు మ‌ద్ద‌తు

మీ టు కు సింధు మ‌ద్ద‌తు

  న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తూ ప్రకంపనలు పుట్టిస్తున్న 'మీ టూ' ఉద్యమానికి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మద్దతు పలికారు. ప్రస్తుతం 'మీ టూ' పెద్ద మనుషుల ముసుగులో చలామణి అవుతున్న వివిధ రంగాలకు చెందిన 'మగానుభావుల' నిజ స్వరూపాన్ని బయటపెట్టే ఆయుధంగా మారింది. సినీ, జర్నలిజం రంగాల్లో పెద్దలుగా చలామణీ అవుతున్న ఎంతోమంది అసలు సిసలు వ్యక్తిత్వాన్ని బట్టబయలు చేస్తోంది. అయితే నిన్న మొన్నటి వరకు ఈ రెండు రంగాలకు చెందిన ప్రముఖుల వేధింపులే బయటికి రాగా.. నేడు తాజాగా క్రీడారంగంలో కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారంటూ మాజీ డబుల్స్‌ షట్లర్‌ గుత్తా జ్వాల తన 'మీ టూ' స్టోరీని బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తమపై జరిగిన వేధింపుల గురించి ముందుకొచ్చి గళం విప్పిన వారందరికీ ముందుగా నా అభినందనలు. వారిని నేను గౌరవిస్తున్నా' అని మహిళలకు సంబంధించిన 'సఖి' సేవల ప్రారంభోత్సవం సందర్భంగా పివి సింధు చెప్పారు.