మీడియాపై షమీ భార్య దాడి

మీడియాపై షమీ భార్య దాడి

   కోల్‌కతా : ఇటీవలికాలంలో విలేక రుల నుండి ఎదురౌతున్న పలు ప్రశ్నల నేపథ్యంలో క్రికెటర్‌ షమీ భార్య జహాన్‌ హసీన్‌ అతిగా ప్రవర్తించారు. నగరంలోని సెయింట్‌ సెబాస్టియన్స్‌ స్కూల్‌ ఆవరణలో మంగళవారం జర్నలిస్టులు ఆమెను వీడియో చిత్రీకరించే క్రమంలో ఒక విలేకరి కెమెరా లాక్కొని పగలగొట్టారు. అదే సమ యంలో గట్టిగా అరుస్తూ తన కారులో వెళ్లి పోయారు. గత కొన్ని రోజులుగా మీడియా ముందుకొచ్చి సావధానంగా సమాధానా లిచ్చిన జహాన్‌.. నేడు సహనం కోల్పోయి ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. మోడల్‌, ఐపిఎల్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు ఛీర్‌ గర్ల్స్‌గా ఉన్న హసీన్‌కు షమీకంటే ముందే వేరే వ్యక్తితో వివాహమై ఇద్దరు ఆడ పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిసింది.