ముంబయి మారథాన్‌లో అపశృతి

ముంబయి మారథాన్‌లో అపశృతి

 ముంబయి : ముంబయి మారథాన్‌లో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన ఈ మారథాన్‌లో పాల్గొన్న అనేక మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది డీహైడ్రేషన్‌, నరాల తిమ్మిరి వంటి వాటితో ఇబ్బంది పడటంతో వైద్య సహాయం అందించారు. ఈ మారథాన్‌లో సుమారు 3226 మంది పాల్గొనగా అనేక మంది అస్వస్థతకు గురికావడంతో ఆసియన్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజరు డి సెల్వ ఆధ్వర్యంలో ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. 15 మంది ఆసుపత్రి పాలు కాగా..వీరిలో 13 మంది డిశ్చార్జి కానున్నారు. వాతావరణ పరిస్థితులు, దుమ్ము కారణంగా మారధాన్‌ చేసిన వారు ఇబ్బందులకు గురయ్యారని డాక్టర్‌ విజరు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులేర్పడ్డాయని వెల్లడించారు. కాగా, ఈ మారధాన్‌లో పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన కోస్మాస్‌ లగత్‌, మహిళల విభాగంలో ఈథిపియాకు చెందిన వోర్కనేష్‌ అలేమూ విజేతలుగా నిలిచారు. లగత్‌ ఈ రేసును రెండు గంటల 9 నిమిషాల 15 సెకన్లలో ముగించగా, అలేమా రెండు గంటల 25 నిమిషాల 45 సెకన్లలోనూ పూర్తి చేశారు.