ప్రారంభ వేడుకలకు హాజరుకానున్న రొనాల్డో

ప్రారంభ వేడుకలకు హాజరుకానున్న రొనాల్డో

 మాస్కో : బ్రెజిల్‌ లెజెండ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు రొనాల్డో రష్యాలో జూన్‌ 14న ప్రారంభం కానున్న ఫుట్‌బాల్‌ ఆరంభ వేడుకలకు హాజరుకానున్నాడు. ప్రారంభ వేడుకలతోపాటు రష్యా-సౌదీ అరేబియాల మ్యాచ్‌ను కూడా రొనాల్డో వీక్షించనున్నాడు. బ్రెజిల్‌ జట్టు ప్రపంచకప్‌ 1994, 2002 ఏడాదుల్లో సాధించిన జట్టులో కీలక సభ్యుడు. ఆరంభ వేడుకల్లో రొనాల్డోనే కాకుండా బ్రిటీష్‌ పాప్‌స్టార్‌ రోబీ విలియమ్స్‌ మరియు రష్యాకు చెందిన సొప్రనో ఐదా గారిఫుల్లినా పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. మాస్కోలోని లూగ్నికి మైదానంలో ప్రారంభ వేడుకలు, తొలి మ్యాచ్‌ జరగనుంది.