పృథ్వీషాకు గాయం

పృథ్వీషాకు గాయం

  సిడ్నీ : ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ ప్రారంభానికే ముందే భారత క్రికెట్‌ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరుగుతోన్న నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో యువకెరటం, ఓపెనర్‌ పృథ్వీషా గాయపడ్డాడు. సీఏ ఎలెవన్‌ జట్టు ఓపెనర్‌ మ్యాక్స్‌ బ్రియాంట్‌ క్యాచ్‌ అందుకునే క్రమంలో ఈ ముంబై క్రికెటర్‌ ఎడమ చీలిమండకు గాయమైంది. అతని ఎడమ మడిమ సుమారు 90 డిగ్రీలు వంగిపోయింది. వెంటనే ఫిజియోలు షాను ఆసుపత్రికి తరిలించి పరీక్షలు జరిపారు. అతని చీలిమండ కీలుకు గాయం అయిందని తేలడంతో పృథ్వీషా తొలి టెస్ట్‌ ఆడటం లేదని బిసిసిఐ తెలిపింది. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లోనే శతకం బాధిన పృథ్వీషా అందరి దష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. 

ఈ ప్రదర్శనతోనే ప్రతిష్టాత్మక ఆసీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ప్రస్తుత ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సైతం ప థ్వీ షా (69 బంతుల్లో 66 పరుగులు, 11 ఫోర్లు) తనదైన శైలిలో చెలరేగాడు. మంచి ఫామ్‌లో ఉన్న ప థ్వీషా ఇలా గాయంతో జట్టుకు దూరం కావడం కోహ్లిసేనకు తీరని లోటే. అసలే టాపా ర్డర్‌లో ఎవరిని ఆడించాలని తలపట్టుకుంటున్న టీమిండియా మేనేజ్‌మెంట్‌ కు ప థ్వీషా గాయం మరింత చిక్కులో పడేసింది. ఇక షా రెండో టెస్ట్‌లోపు అందుబాటు లోకి వస్తాడా లేక సిరీస్‌ నుంచి దూరమవు తాడా? అనేది అతని గాయం తీవ్రతపై ఆధారపడి ఉంది. ఒక వేళ షా సిరీస్‌ మొత్తం దూరమైతే.. అతని స్థానంలో శిఖర్‌కు జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది.