ఆర్‌సీబీ టైటిల్ స్పాన్సర్‌గా ఎరాస్ నౌ

ఆర్‌సీబీ టైటిల్ స్పాన్సర్‌గా ఎరాస్ నౌ

  బెంగళూరు: బాలీవుడ్‌కు చెందిన ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్లాట్‌ఫామ్ ఎరాస్ నౌ(Eros Now) ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీతో జతకట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టుతో భారీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2018 సీజన్‌కు ఆర్‌సీబీ టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగనున్నట్లు ఎరాస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. దాదాపు రెండు నెలల పాటు జరిగే అతిపెద్ద క్రీడా సంరంభం ద్వారా భారతీయ వినియోగదారులతో నిజమైన డిజిటల్ వీడియో బ్రాండ్ నిర్మించడానికి కంపెనీ ప్రయత్నాల్లో ఈ సహకారం ఓ భాగమని సంస్థ పేర్కొంది. ఎరాస్ డిజిటల్ వీడియో బ్రాండ్‌ను ఎక్కువ మంది ప్రేక్షకుల దృష్టికి తీసుకెళ్లాలని ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ భావిస్తోంది. ఐపీఎల్-11 సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో అట్టహాసంగా ఆరంభంకానుంది. ఆర్‌సీబీ తన తొలి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఏప్రిల్ 8న తలపడనుంది.