రష్యా బేస్ జంపర్ మృతి

రష్యా బేస్ జంపర్ మృతి

 మధ్యామాంచల్ (నేపాల్): రష్యాకు చెందిన సాహస విన్యాసాల క్రీడాకారుడు వాలెరీ రోజోవ్ (52) బేస్ జంపింగ్ చేస్తూ మరణించాడు. సెవెన్ సమ్మిట్ అడ్వెంచర్ క్వెస్ట్‌లో భాగంగా హిమాలయాకు వచ్చిన రోజోవ్ శనివారం ఎవరెస్ట్ ప్రాంతంలోని 6812 మీటర్ల ఎతైన మౌంట్ అమా దాబ్లమ్ (22, 349 అడుగులు) పర్వతం నుంచి జంప్ చేశాడు. మార్గమధ్యలో వింగ్‌సూట్‌లో సమస్య తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద పరిస్థితులను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నామని సెవెన్ సమ్మిట్ క్లబ్ అధికారి మింగ్మా గేల్ షెర్పా తెలిపారు. వింగ్‌సూటర్‌గా ఎంతో అనుభవం ఉన్న రోజోవ్.. 2016లో 7700 మీటర్ల మౌంట్ చో వుయ్‌పై నుంచి దూకి రికార్డు సృష్టించాడు. 2013లో మౌంట్ ఎవరెస్ట్ (7,220 మీటర్ల), కిలిమంజారో (5,895 మీటర్లు), వెస్ట్రన్ బ్రీచ్ వాల్ (5,460 మీటర్లు) పర్వతాలనుంచి కూడా దూకాడు.