సరెనా మ్యాచ్‌లకు దూరం : ఛైర్‌ అంపైర్లు

సరెనా మ్యాచ్‌లకు దూరం : ఛైర్‌ అంపైర్లు

  పారిస్‌: యుఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో ఛైర్‌ అంపైర్‌పై నోరు పారేసుకున్న సెరెనా విలియమ్స్‌ ఆడే మ్యాచ్‌లకు అంపైర్లుగా బాధ్యతలు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు. అంతేగాక ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. ఫైనల్లో సెరెనా కోచ్‌ సూచనలు తీసుకోవడంపై చైర్‌ అంపైర్‌ రామోస్‌ తొలిగా హెచ్చరించి నిబంధనలు అతిక్రమించడంతో ఓ పాయింట్‌ కోత పెట్టాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సెరెనా రామోస్‌ను 'దొంగ... నా నుంచి పాయింట్‌ దొంగలించావు. ఇక నువ్వు బతికున్నంత కాలం నేనాడే మ్యాచ్‌లకు అంపైర్‌గా ఉండబోవు' అని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో అంపైర్ల ప్యానెల్‌ బుధవారం సెరెనా ఆడే మ్యాచ్‌లకు దూరంగా ఉంటామంటూ గ్రాండ్‌స్లామ్‌ నిర్వాహకులకు తెలియచేశారు.