సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం

సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం

  భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం దక్కింది. మొత్తం 14 మందిలో భారత్ నుంచి గంగూలీ, అంజుమ్ చోప్రాలకు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీ కామెంటేటర్ ప్యానెల్‌లో దాదాకి చోటు దక్కింది. మరో రెండు రోజుల్లో న్యూజిలాండ్‌లో అండర్-19 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుండగా, కామెంటేటర్ బాధ్యతలు నిర్వహించేవారి జాబితాను తాజాగా ఐసీసీ విడుదల చేసింది. అలాగే ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల మాజీ క్రికెటర్లకూ ఈ జాబితాలో చోటు దక్కింది.