సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌కు గాయం

సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌కు గాయం

  కాండీ: శ్రీలంక పర్యటనలో సౌతాఫ్రికా జట్టుకు పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఆతిథ్య లంకతో మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌కు గాయమైంది. ఆదివారం జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టేందుకు డైవింగ్ చేయడంతో అతని భుజానికి గాయమైంది. దీంతో పరిమిత ఓవర్ల సిరీస్‌లోని మిగతా మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు. క్యాచ్ పట్టే క్రమంలో డుప్లెసిస్ కుడి భుజానికి గాయమైంది. దురదుష్టవశాత్తు టూర్‌లో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. 

అని టీమ్ మేనేజర్ మహ్మద్ ముసాజే ఒక ప్రకటనలో తెలిపారు. అతడు పూర్తిగా కోలుకునేందుకు కనీసం 6 వారాల విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు.ఆదివారం జరిగిన మూడో వన్డేలో సౌతాఫ్రికా 78 పరుగుల తేడాతో లంకను చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. మరో రెండు వన్డేలు మిగిలుండగానే ఆ జట్టు సిరీస్ చేజిక్కించుకుంది. ఆతిథ్య శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 3-0తో ఆధిక్యం సంపాదించింది. ఆగస్టు 14న కొలంబో వేదికగా ఇరు జట్లు ఏకైక టీ20లో తలపడనున్నాయి.