స్టార్‌ ఇండియాకే ప్రసార హక్కులు

స్టార్‌ ఇండియాకే ప్రసార హక్కులు

 ముంబయి : టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలానికి ఉత్కంఠ వీడింది. గురువారం బీసీసీఐకి కళ్లుచెదిరే రేటును చెల్లిస్తూ స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సంస్థ ఈ-వేలంలో ప్రసార హక్కులను 6,138.10 కోట్లకు దక్కించుకుంది. దీంతో 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను ఆ సంస్థ కైవసం చేసుకున్నట్లయ్యింది. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా స్వదేశంలో ఐదేళ్ళలో 102 మ్యాచ్‌లు ఆడనుండగా... సగటున ఒక్కో మ్యాచ్‌కు రూ.60.1 కోట్లను ఆ సంస్థ చెల్లించినట్లైంది. దేశవాళీ మ్యాచ్‌లతోపాటు మహిళా క్రికెట్‌ మ్యాచ్‌లను కూడా స్టార్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదేగాక 2018-2022ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కూడా స్టార్‌ ఇండియానే దక్కించుకుంది.