టెన్నిస్ ఆటగాడిని ఢీకొట్టిన బాల్ బాయ్!

టెన్నిస్ ఆటగాడిని ఢీకొట్టిన బాల్ బాయ్!

  పారిస్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చిన్న అపశృతి చోటు చేసుకున్నది. రొలాండ్ గారొస్ అనే బాల్ బాయ్ ప్రమాదవశాత్తు వెళ్లి బోస్నియా టెన్నిస్ ప్లేయర్ డామిర్ జుమ్‌హర్‌ను ఢీకొట్టాడు. బాల్ బాయ్.. డామిర్ చాతికి బలంగా ఢీకొని కోర్టులో పడిపోయాడు. బాల్‌ను క్యాచ్ పట్టడానికి అటు ప్లేయర్, ఇటు బాల్‌బాయ్ ఒక్కసారిగా కోర్టులోకి పరిగెత్తుకొచ్చారు. దీంతో ఒకరినొకరు ఢీకొన్నారు.

వెంటనే బాల్ బాయ్‌కి ఫస్ట్ ఎయిడ్ అందించడంతో కుదుటపడ్డాడు. పెద్దగా గాయాలేమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జూన్ 1న జరగగా.. దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్ర‌మాదం జ‌రిగిన ఓ గంట త‌ర్వాత థ‌మ్స్ అప్ సింబ‌ల్ చూపిస్తూ.. నాకేం కాలే.. నేను బాగానే ఉన్నా.. అంటున్న బాల్ బాయ్‌