తారల తళుకుల మధ్య ఐపీఎల్ సీజన్...

తారల తళుకుల మధ్య ఐపీఎల్ సీజన్...

  ముంబై: ప్రేక్షకులు ఒళ్లంతా కండ్లు చేసుకుని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వచ్చేసింది. శనివారం వాంఖడే వేదికగా ఐపీఎల్‌కు అట్టహాసంగా తెరలేవనుంది. కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. సాయంత్రం ఆరు గంటలకు మొదలయ్యే ఆరంభోత్సవ వేడుకల్లో స్టార్ హీరోలు హృతిక్ రోషన్, వరుణ్ ధావన్, డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా, హీరోయిన్లు తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, పరిణితీ చోప్రా అదిరిపోయే డ్యాన్సులతో అభిమానులను కనువిందు చేయనున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత చెన్నై, ముంబై మ్యాచ్ మొదలవుతుంది.