వ్యాఖ్యాతగా వార్నర్‌

వ్యాఖ్యాతగా వార్నర్‌

   సిడ్నీ : బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ కొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఈ నెలలో ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌, ఒక టీ20 మ్యాచ్‌ నిమిత్తం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది. మైదానంలో క్రికెట్‌కు దూరమైన వార్నర్‌ తొలిసారిగా ఈ సిరీస్‌కు వ్యాఖ్యాతగా పనిచేయనున్నాడు. ఛానెల్‌-9కు వ్యాఖ్యాతగా వార్నర్‌ వ్యవహరించను న్నట్లు తెలిసింది. జూన్‌ 16న జరగనున్న రెండో వన్డేకు వార్నర్‌ కామెంట్రీ బ ందంతో వచ్చి చేరనున్నాడు. 

అలాగే, ఈ సిరీస్‌ తర్వాత స్మిత్‌తో కలిసి కెనడాలో ప్రారంభం కానున్న గ్లోబల్‌ టీ20 టోర్నీలో ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ వార్నర్‌ కూడా ఆడనున్నాడు. జూన్‌ 28 నుంచి జూలై 15 తేదీల మధ్య ఈ టోర్నీ జరగనుంది. మార్చి నెలలో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఓపెనర్‌ బెన్‌క్రాఫ్ట్‌ బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనితో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు కూడా సంబంధం ఉందని తేలడంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా స్మిత్‌, వార్నర్‌పై ఏడాది, బెన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలలపాటు నిషేధం విధించింది.