వింట‌ర్ ఒలింపిక్స్‌కు నార్త్ కొరియా

వింట‌ర్ ఒలింపిక్స్‌కు నార్త్ కొరియా

 సియోల్: ద‌క్షిణ కొరియాలో జ‌రిగే వింట‌ర్ ఒలింపిక్స్‌లో నార్త్ కొరియా పాల్గోనున్న‌ది. ఫిబ్ర‌వ‌రిలో ద‌క్షిణ కొరియాలో ఈ గేమ్స్ జ‌ర‌గ‌నున్నాయి. దీంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త కొంత మేర త‌గ్గింది. నార్త్ కొరియా అథ్లెట్లు త‌మ దేశానికి రావ‌చ్చు అని సియోల్ పేర్కొన్న‌ది. అథ్లెట్లు, మ‌ద్ద‌తుదారులు ద‌క్షిణ కొరియాకు వెళ్ల‌నున్న‌ట్లు నార్త్ కొరియా వెల్ల‌డించింది. చర్చలు దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభం అయ్యాయి. రెండేళ్ల తర్వాత ఆ రెండు దేశాల మధ్య మళ్లీ శాంతి పవనాలు వీస్తున్నాయి. పన్‌ముంజన్ గ్రామంలో ఉన్న పీస్ హౌజ్‌లో సమావేశం జరుగుతోంది. వింటర్ ఒలింపిక్ గేమ్స్‌లో ఉత్తర కొరియా పాల్గొనే అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. కొరియా దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ప్రయత్నిస్తామని దక్షిణ కొరియా పేర్కొన్నది. మూడేళ్ల క్రితం కీసాంగ్ పారిశ్రామిక వాడలో ఆర్థిక ప్రాజెక్టులు నిలిపివేసిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వింట‌ర్ ఒలింపిక్స్‌లో నార్త్ కొరియా పాల్గోనున్న‌ది.