14 నుంచి అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్ షిప్

14 నుంచి అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్ షిప్

 హైదరాబాద్ : ఈ నెల 14, 15వ తేదీల్లో తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ధనంజయ్ గౌడ్ ప్రకటించారు. ఎల్‌బీ స్టేడి యంలో బాక్సింగ్ హాల్‌లో ఈ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన వారు విశాఖపట్నంలో జరగనున్న జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారని ఆయన తెలిపారు. ఆసక్తిగల బాక్సర్లు తమ ఎంట్రీలను కార్యనిర్వాహక కార్యదర్శి ఎ.రాజుకు 14వ తేదీ ఉదయం 8 గంటల లోపు అందజేయాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం 99855 12134, 9550922244ను సంప్రదించాలని ఆయన సూచించారు.