బెంగళూరు : ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన పోటీల్లో అవధే వారియర్స్ జట్టు చెన్నై స్మాషర్స్‌పై 4-3తో గెలిచింది. పురుషుల డబుల్స్ ట్రంప్, సింగిల్స్ మ్యాచ్‌లో అవధే గెలిచి 3-0 ఆధిక్యత సాధించింది. మహిళల సింగిల్స్ ట్రంప్, మిక్స్డ్ డబుల్స్‌లో ఢిల్లీ గెలిచి 3-3తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మక పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ఎస్.డబ్ల్యు.హో (అవధే) 15-6, 15-6తో ఓసెఫ్(ఢిల్లీ)పై గెలిచి మ్యాచ్‌ను ముగించాడు. మిక్స్డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-క్రిస్టియన్(అవధే) జోడీ 13-15, 15-9, 14-15 పాయింట్ల తేడాతో ఎడ్‌కాక్(ఢిల్లీ)చేతిలో అనూహ్యంగా ఓడింది.