అజ‌య్‌ ఠాకూర్‌కే కెప్టెన్సీ

అజ‌య్‌ ఠాకూర్‌కే కెప్టెన్సీ

 హైదరాబాద్‌ : ఏడు సార్లు ఆసియన్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత టీమిండియా ఆగష్టులో ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియన్‌ గేమ్స్‌లో హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. ఆసియన్‌ గేమ్స్‌లో పాల్గొనే 12 మంది సభ్యులతో కూడిన కబడ్డీ జట్టును అఖిల భారత అమెచ్యూర్‌ కబడ్డీ సమాఖ్య (ఏకేఎఫ్‌) బుధవారం ప్రకటించింది. తమిళ్‌ తలైవాస్‌ సారథి అజరు ఠాకూర్‌ మరోసారి టీమిండియాకు సారథ్యం వహించనున్నాడు. సీనియర్లను పక్కకు పెట్టి యువకులతో కూడిన జాబితాను విడుదల చేసింది. సీనియర్లు రాకేశ్‌ కుమార్‌, అనూప్‌ కుమార్‌, మంజీత్‌ చిల్లర్‌, సురేంద్ర నాడాలకు అవకాశం దక్కలేదు. ప్రదీప్‌ నర్వాల్‌, రాహుల్‌ చౌదరి, అజరు ఠాకూర్‌, రిషాంక్‌ దేవడిగ, రోహిత్‌ కుమార్‌, మోనూ గోయత్‌లతో రైడింగ్‌ విభాగం బలంగా ఉండగా.. దీపక్‌ నివాస్‌ హుడా, సందీప్‌ నర్వాల్‌, గిరీష్‌ మారుతి ఎర్నాక్‌, మోహిత్‌ చిల్లర్‌, రాజు లాల్‌ చౌదరీ, మల్లేష్‌ గంగాధరిలతో ఢిఫెండింగ్‌ దుర్భేద్యంగా ఉంది.