ఆర్చరీలో భారత్‌కు మూడో స్థానం

ఆర్చరీలో భారత్‌కు మూడో స్థానం

  కోల్‌కతా : చైనీస్‌ తైపీలో జరుగుతున్న ఆసియాకప్‌ వరల్డ్‌ ఆర్చరీ ర్యాంకింగ్స్‌ టోర్నీ స్టేజ్‌-3 విభాగంలో భారతజట్టు ఇరాన్‌ జట్టుతో సంయుక్తంగా మూడోస్థానంలో నిలిచింది. మంగళవారంతో ముగిసిన ఆర్చరీ పోటీలలో భారత్‌ చివరిరోజు మహిళల సింగిల్స్‌ కాంపౌండ్‌రౌండ్‌ విభాగంలో దివ్యదయాల్‌ రజిత పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో చైనీస్‌ తైపీకి చెందిన తింగ్‌-యు చేతిలో 141-144 పాయింట్ల తేడాతో ఓటమిపాలై రజిత పతకానికే పరిమితమైంది. దీంతో భారతజట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు రజిత, ఒక కాంస్య పతకాలను గెలుచుకున్నట్లయ్యింది. చైనీస్‌ తైపీలో సూపర్‌ తుపాన్‌ కారణంగా నాలుగు రోజులు జరగాల్సిన పోటీలను రెండురోజులకు కుదించారు.