ఆసియా చాంపియన్‌షిప్‌లో దీపికకు కాంస్యం

ఆసియా చాంపియన్‌షిప్‌లో దీపికకు కాంస్యం

 బ్యాంకాక్: ఆసియా చాంపియన్‌షిప్‌లో పతకాల మోత మోగించిన భారత ఆర్చర్లు ఇండోర్ ప్రపంచకప్‌లో మాత్రం తేలిపోయారు. మహిళ విభాగంలో దీపిక కాంస్య పతకం గెలిచి కాసింత ఊరటనిచ్చింది. మహిళల రికర్వ్ కాంస్య పోరులో మూడో సీడ్ దీపిక 7-3తో సయానా సైరెంపిలోవా (రష్యా)పై గెలిచింది. పురుషుల రెండో రౌండ్‌లో టాప్‌సీడ్ అతాను దాస్ 3-7తో మటియో ఫిసోర్ చేతిలో కంగుతిన్నాడు. ఇతర విభాగాల్లో జయంత్ 7-3తో రాహుల్ బెనర్జీపై గెలిచినా.. రెండో రౌండ్‌లో 2-6తో కిమ్ జూ వన్ (కొరియా) చేతిలో ఓడాడు.