ఆస్ట్రేలియా జ‌ట్టులో భారీ మార్పులు

ఆస్ట్రేలియా జ‌ట్టులో భారీ మార్పులు

  మెల్‌బోర్న్‌: ఇండియాతో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో ఓడిన ఆస్ట్రేలియా జ‌ట్టులో భారీ మార్పులు చేశారు. శ్రీలంక‌తో జ‌రిగే టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియా జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఆ జ‌ట్టులో కొత్త‌గా ఓ యువ‌ బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశారు. కేవ‌లం 8 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన‌ 20 ఏళ్ల విల్ పుకోవ‌స్కీకి జ‌ట్టులో స్థానం క‌ల్పించారు. విక్టోరియా త‌ర‌పున అత‌ను గ‌త సీజ‌న్‌లో 243 ర‌న్స్ చేశాడు. ఇండియాతో సిరీస్‌లో ఘోరంగా విఫ‌ల‌మైన ఆర‌న్ ఫించ్‌, పీట‌ర్ హ్యాండ్స్‌కూంబ్‌ల‌ను కూడా టీమ్ నుంచి త‌ప్పించారు. వారి స్థానంలో మ్యాట్ రెన్‌షా, జో బ‌ర్న్స్‌ను ఎంపిక చేశారు. ఈనెల 24వ తేదీ నుంచి శ్రీలంక‌తో జ‌రిగే రెండు టెస్టుల సిరీస్‌కు మ‌రో కీల‌క ప్లేయ‌ర్ షాన్ మార్ష్‌ను కూడా టెస్టు జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఇండియాతో సిరీస్‌లో అత‌ను కేవ‌లం ఒకే హాఫ్ సెంచ‌రీ చేశాడు. దీంతో అత‌నిపై వేటు ప‌డింది. వైస్ కెప్టెన్ మిచెల్ మార్ష్‌ను కూడా లంక‌తో సిరీస్‌కు సెలెక్ట్ చేయ‌లేదు.