అవధే చేతిలో నార్త్‌ చిత్తు

అవధే చేతిలో నార్త్‌ చిత్తు

 బెంగళూరు : ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన పోటీల్లో అవధే వారియర్స్‌ జట్టు 6-0తో నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ జట్టును చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌ రెండోమ్యాచ్‌ను మాత్రమే నార్త్‌ జట్టు గెలవగల్గింది. మిగిలిన పోటీలన్నింటిలోనూ అవధే జోరు కొనసాగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌లో పొన్నప్ప-క్రిస్టియన్‌సేన్‌(అవధే) జోడీ 15-7, 15-14తో ఛన్‌-నో (నార్త్‌) జోడీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌ ట్రంప్‌ మ్యాచ్‌గా తీసుకున్న నార్త్‌ తరఫున బరిలోకి దిగిన సైనా నెహ్వాల్‌ 15-11, 11-15, 7-15 పాయింట్ల తేడాతో అనూహ్యంగా జంగ్‌(అవధే) చేతిలో ఓడిపోవడంతో అవధే గెలవగల్గింది. పురుషుల డబుల్స్‌ మ్యాచ్‌లో లీ-ఎఎంఆర్‌(అవధే) జోడీ 15-5, 15-12 పాయింట్ల తేడాతో కపిల-సంగ్‌(నార్త్‌) జోడీని చిత్తుచేసి మ్యాచ్‌ను 6-0తో ముగించారు.