బెల్జియంపై భారత్‌ సంచలనం

బెల్జియంపై భారత్‌ సంచలనం

 భువనేశ్వర్‌ : ప్రపంచలీగ్‌ హాకీ ఫైనల్‌ టోర్నమెంట్‌ క్వార్టర్‌ఫైనల్లో బుధవారం భారత పురుషుల హాకీ జట్టు బెల్జియంను ఓడించింది. లీగ్‌ దశకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన భారత జట్టు నాకౌట్‌ మ్యాచ్‌లో సమిష్టిగా రాణించింది. బుధవారంనాడిక్కడ జరిగిన మ్యాచ్‌లో 3-2 గోల్స్‌ తేడాతో బెల్జియంను ఓడించి సంచలనం సృష్టించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 3-3తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ను ఇరుజట్లకు కేటాయించారు. పెనాల్టీ షూటౌట్‌లో భారత జట్టు బెల్జియంను 3-2 గోల్స్‌ తేడాతో ఓడించి సెమిస్‌కు క్వాలిఫై అయ్యింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 4-1తో స్పెయిన్‌ను ఓడించింది.