భారత మెస్సీ... మన ఛెత్రీ

భారత మెస్సీ... మన ఛెత్రీ

  ముంబాయి : సునీల్‌ ఛెత్రీ అన్నీ తానై ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ను భారత్‌కు అందించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఇంటర్‌ కాంటినెంటెల్‌ కప్‌ ఫైనల్‌ల్లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్‌చేసి భారత్‌ కప్‌ గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఫైనల్లో చేసిన రెండో గోల్‌తో ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ సరసన కూడా చేరాడు. దీంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక గోల్స్‌ చేసిన మూడో ఆటగాడిగా చత్రీ ఘనతను అందుకున్నాడు. ఛెత్రీ తన ఆటతీరుతో ముంబయి ఎరీనా స్టేడియంలోని 18,000 మంది ప్రేక్షకులు కనువిందు చేశాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్‌) 81 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా, మెస్సీ(అర్జెంటీనా), ఛెత్రీ(భారత్‌)లు 64గోల్స్‌తో ద్వితీయ, డేవిడ్‌ విల్లా(డేవిడ్‌ విల్లా) 59 గోల్స్‌తో తృతీయ స్థానాల్లో కొనసాగుతున్నారు.