భారత్‌కు కఠిన పరీక్ష

భారత్‌కు కఠిన పరీక్ష

 భువనేశ్వర్: రెండు వరుస పరాజయాలతో ఇబ్బందులుపడుతున్న భారత్‌కు.. హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ (హెచ్‌డబ్ల్యూఎల్)లో కఠిన పరీక్ష ఎదురుకానుంది. బుధవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో ఏమాత్రం సత్తా చాటలేకపోయినా టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో సంచలనం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. అయితే పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మల్చడంలో సిద్ధహస్తులైన బెల్జియంను అడ్డుకోవడం భారత్‌కు అంత సులువుకాదు. ముఖాముఖి రికార్డులో బెల్జియంతో ఆడిన 71 మ్యాచ్‌ల్లో భారత్ 45 గెలువగా, 17 మ్యాచ్‌ల్లో ఓడింది. 10 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. కానీ ఇటీవల ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా మూడింటిలో ఓడటం ప్రతికూలాంశం.ఫార్వర్డ్స్ మన్‌దీప్, ఆకాశ్‌దీప్, సునీల్, లలిత్ ఉపాధ్యాయ సత్తా చాటితే తిరుగుండదు. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిస్తే భారత్‌కు తిరుగుండదు.