భారత్‌కు వరుసగా రెండో ఓటమి

భారత్‌కు వరుసగా రెండో ఓటమి

 భువనేశ్వర్: నిలకడలేని ఆటతీరుతో భారత హాకీ జట్టు వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ప్రపంచ హాకీ లీగ్ ఫైనల్స్‌లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 0-2తో జర్మనీ చేతిలో ఓడింది. జర్మనీ కెప్టెన్ హనెర్ మార్టిన్ (17వ ని) పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. మరో మూడు నిమిషాల వ్యవధిలోనే మాట్స్ గ్రామ్‌బుస్క్ (20వ ని) రెండో గోల్‌తో జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఇక ఇక్కడి నుంచి గోల్ చేసేందుకు వచ్చిన అవకాశాలను భారత్ చేజేతులా జారవిడుచుకుంది. జర్మనీ గోలీ టోబియర్ వాల్టర్ భారత్ దాడులను సమర్థంగా నిలువరించాడు. ఈ ఓటమితో భారత్ ఒక పాయింట్‌తో పూల్ బీలో చివరి స్థానానికి పరిమితమైంది.