బ్రెజిల్‌ జట్టుకు రాళ్లు, గుడ్లతో స్వాగతం

బ్రెజిల్‌ జట్టుకు రాళ్లు, గుడ్లతో స్వాగతం

  బ్రాసిలియా : ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌ జట్టుకు స్వదేశంలో అవమానం జరిగింది. ఫుట్‌బాల్‌ ప్రపంచానికి రారాజుగా చెప్పుకొనే బ్రెజిల్‌ ఈసారి క్వార్టర్‌ఫైనల్లోనే అనూహ్యంగా ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. దీంతో స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు అభిమానులు రాళ్లు, గుడ్లతో స్వాగతం పలికారు. వారు ప్రయాణిస్తున్న బస్సుపై గుడ్లు, రాళ్లు విసిరి హంగామా చేశారు. గత ప్రపంచకప్‌లో జర్మనీ చేతిలో సెమీఫైనల్లో 7-1తో బ్రెజిల్‌ ఓటమి పాలు కాగా... ఈసారి బెల్జియం చేతిలో క్వార్టర్స్‌లోనే పరాజయం పాలైంది. దీన్ని జీర్ణించుకోలేని బ్రెజిల్‌ అభిమానులు బస్సును ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారు ఆందోళన కొనసాగించారు. దీంతో రాళ్ల దాడి నుంచి ఆటగాళ్లను రక్షించేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది.