చిత్తుగా ఓడిన షరపోవా

చిత్తుగా ఓడిన షరపోవా

  పారిస్‌ : రష్యా టెన్నిస్‌ స్టార్‌, మాజీ చాంపియన్‌ మారియా షరపోవా క్వార్టర్‌ఫైనల్లోనే ఓడింది. మూడో సీడ్‌, స్పెయిన్‌ స్టార్‌ గార్బిన్‌ ముగురుజతో గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో షరపోవా 2-6, 1-6 సెట్ల తేడాతో పరాజయం పాలైంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ భుజం కండరాలు పట్టేయడంతో షరపోవాకు వాకోవర్‌తో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. మరో మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ హవా ఫ్రెంచ్‌ఓపెన్‌లో కొనసాగిస్తోంది. జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్‌ కెర్బర్‌తో జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో హలెప్‌ 6-7(2-7), 6-3, 6-2 తేడాతో విజయం సాధించింది. ఇక హలెప్‌ సెమీఫైనల్లో స్పెయిన్‌ స్టార్‌ గార్బిన్‌ ముగురుజాతో తలపడనుంది.