డేవిస్ క‌ప్‌లో లియాండ‌ర్ పేస్ కొత్త చ‌రిత్ర‌

డేవిస్ క‌ప్‌లో లియాండ‌ర్ పేస్ కొత్త చ‌రిత్ర‌

 హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ కొత్త చరిత్ర సృష్టించాడు. డేవిస్ కప్ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించాడు. డేవిప్ కప్‌లో అత్యంత సక్సెస్‌ఫుల్ ప్లేయర్‌గా లియాండర్ నిలిచాడు. ఇప్పటి వరకు లియాండర్ 43 సార్లు డేవిస్ కప్ డబుల్స్‌లో గెలిచాడు. పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ అనే ప్లేయర్ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు. ఆ రికార్డును ఇప్పడు పేస్ బ్రేక్ చేశాడు. ఇవాళ డేవిస్ కప్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్ జోడి ఈజీగా విజయం సాధించింది. బోపన్న, పేజ్ జోడి చైనా జంటపై 5-7, 7-6, 7-6 స్కోర్‌తో విక్టరీ సాధించింది. చైనాలో జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉన్నది. 1-2 పాయింట్ల తేడాతో చైనా ముందుకు దూసుకెళ్లుతున్నది. ఈ టోర్నీలో రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉన్నది.